చేబ్రోలు: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గూడ్స్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుల్లో ఒకరిని షేక్ హాసినాగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నలుగురు ఇలా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఏలూరు జిల్లాలో విషాదం.. రైలు కిందపడి నలుగురు ఆత్మహత్య..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 05, 2026, 08:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)