శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అంత్యక్రియల సాయం రూ.20 వేలకు పెంపు

1 గంట క్రితం

municipal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 10:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు అందించే అంత్యక్రియల సాయాన్ని రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ ‌కుమార్‌ ‌శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన అంత్యక్రియల సాయం కోసం అవసరమైన వ్యయాన్ని సంబంధిత పట్టణ స్థానిక సంస్థల సాధారణ నిధుల నుంచి భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ పరిపాలన డైరెక్టర్‌ను ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్