బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగోదావరి దాటి పోలవరం జిల్లాలోకి పెద్దపులి

1 గంట క్రితం

Oh my God... a tiger again!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 10:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఊపిరి పీల్చుకున్న ఏలూరు ఏజెన్సీ ప్రజలు

ప్రజాశక్తి - పోలవరం : నాలుగు రోజులుగా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం పాత చేగొండపల్లి పరిసరాల్లో సంచరించిన పెద్దపులి గోదావరి నది దాటి పోలవరం జిల్లాలోకి ప్రవేశించినట్లు అటవీశాఖాధికారులు గుర్తించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన శింగన్నపల్లి వద్ద మంగళవారం రాత్రి పెద్దపులి గోదావరి నది దాటి పోలవరం జిల్లా కొయ్యూరు ముంపు గ్రామంలో ప్రవేశించినట్లు పెద్దపులి మెడకు అమర్చిన శాటిలైట్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా గుర్తించినట్లు అటవీక్షేత్రాధికారి ఎస్‌‌కె.వలీ తెలిపారు. దీంతో పోలవరం మండల పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్