బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకెఐపిఎల్ భూములపై ప్రభుత్వానికి రూ.7 వేల ఖర్చులు

2 గంటల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 11:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : ఎస్ఇజెడ్ ఏర్పాటు కోసం కెఐపిఎల్‌కు కేటాయించిన భూముల వ్యవహారంలో ఏడాది కాలంగా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.7 వేల ఖర్చులు విధిస్తూ, ఆ మొత్తాన్ని న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలులో జాప్యానికి కారణమైన అధికారి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నవంబరు 12కి వాయిదా వేసింది. ఎస్ఇజెడ్ కోసం 2009లో నెల్లూరు జిల్లాలో 4,781 ఎకరాల భూమిని కెఐపిఎల్‌కు కేటాయించినా ఇప్పటి వరకు ఎలాంటి ఎస్ఇజెడ్ ఏర్పాటు చేయలేదని, భూములను ఇతరులకు విక్రయించడంతో పాటు కొన్ని భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటోందని పేర్కొంటూ నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన నాను మునీంద్రరెడ్డి 2025 సెప్టెంబరులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు వాదిస్తూ, సుమారు రూ.1,650 కోట్ల రుణాలు తీసుకున్నారని, రూ.30 వేల కోట్ల విలువైన సిలికా శాండ్ ఉన్న భూముల నుంచి ప్రభుత్వానికి రాయల్టీ ఆదాయం కోల్పోతోందని తెలిపారు. కెఐపిఎల్ తరపున సీనియర్ న్యాయవాది పి విల్సన్ మాట్లాడుతూ, తమ కౌంటర్ ఇప్పటికే దాఖలు చేశామని, భూ కేటాయింపుల రద్దుపై గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు నవంబర్ 12న విచారణకు రానున్నాయని చెప్పారు. సంబంధిత వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్