బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition4న జిఎస్ఎల్‌‌వి ప్రయోగం

1 గంట క్రితం

issro.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 09:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

ప్రజాశక్తి - తిరుమల, సూళ్లూరుపేట రూరల్ :షార్ కేంద్రంలో జిఎస్‌ఎల్‌వి ఎఫ్-17, ఇఒఎస్-05 రాకెట్ నమూనాను శుక్రవారం ప్రయోగించనున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌17 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ద్వారా ఇఒఎస్-05 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్, తుది ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది భారతదేశపు మొట్టమొదటి జియోసింక్రోనస్ ఎర్త్ అబ్జర్వేషన్ (భూ పరిశీలన) ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది 36,000 కిలో మీటర్ల ఎత్తు నుండి భారత ఉపఖండాన్ని స్థిరంగా గమనిస్తూ... వాతావరణ మార్పులు, తుపానులు, వరదలు వంటి విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, అడవులు, జలవనరుల పర్యవేక్షణ, జాతీయ భద్రతకు అవసరమైన రియల్-టైమ్ చిత్రాలను వేగంగా అందిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో నిర్దిష్ట ప్రాంతాలను వేగంగా గమనించే సామర్థ్యం కూడా దీనికి ఉంది. సుమారు 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని జిఎస్ఎల్‌‌వి ఎఫ్ 17 వాహక నౌక సబ్ జియోసింక్రోనస్ ట్రాన్స్‌‌ఫర్ కక్ష్యలోకి చేర్చనుంది. ఐదేళ్ల క్రితం జిఎస్ఎల్‌‌వి ఎఫ్10 ద్వారా చేపట్టిన జిశాట్ 1 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ప్రస్తుత ప్రయోగం ఇస్రోకు అత్యంత కీలకంగా మారింది. గత అనుభవాలను అధిగమించి ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేయాలన్న పట్టుదలతో శాస్త్రవేత్తలు తుది సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలోనూ, సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలోనూ రాకెట్ నమూనాలను ఉంచి ప్రత్యేక పూజలను ఇస్రో చైర్మన్ నారాయణన్‌ నిర్వహించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్