బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ ఆవిష్కరణ

1 గంట క్రితం

1788346197474.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 10:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • లోగో, ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన నాదెండ్ల మనోహర్‌

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, పిఠాపురం : ​జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వేదికగా పార్టీ యూత్ వింగ్ ‘జై కొట్టు’ బుధవారం ఆవిష్కారమైంది. ఇదే వేదిక నుంచి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘జై కొట్టు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి యువత బైక్ ర్యాలీలుగా బయలుదేరి చిత్రాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా పిఠాపురంలోని ఆర్ఆర్ బిహెచ్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ‘జై కొట్టు’ ఆవిష్కరణ వేదిక వద్దకు చేరారు. యువతలో ఉత్సాహం, పోరాట స్ఫూర్తి, ఐక్యతను ప్రతిబింబించేలా పిడికిలి బిగించి జై కొట్టే రూపకల్పనతో ప్రత్యేక లోగో, గీతాన్ని ఆవిష్కరించారు. రాజకీయాల్లో యువతకు భాగస్వామ్యం కల్పించి, వారిని సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ విభాగాన్ని ప్రారంభించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ కల్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌ తలాటం సత్య, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, పిఠాపురం నియోజక వర్గ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్