బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసాదిక్ ఖాన్ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా

1 గంట క్రితం

Sadiq Khan's questioning concludes – to appear in court shortly.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 10:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కాకినాడరూరల్ : కాకినాడలో సంచలనం రేపిన ఎఇ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడు సాధిక్‌ ఖాన్‌ కస్టడీ పిటిషన్ పై విచారణ సెప్టెంబర్ ఏడవ తేదీకి వాయిదా పడింది. ఆగస్టు 24న సర్పవరం పోలీసులు స్పెషల్ మొబైల్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. బుధవారం న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఈ పిటిషన్ వాయిదా పడింది. సాధిక్ ఖాన్ వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని అధికారులు, స్నేహితుల వాట్సాప్ గ్రూపులో పిఠాపురం పంచాయతీరాజ్ ఎఇ నూకరాజు పోస్టు పెట్టి ఆగస్టు 16న రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు బ్రిడ్జి నుంచి తన భార్య, కుమార్తె, మనవడితో కలిసి దూకేశాడు. ఈ ఘటనలో మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ నోటు వెలుగులోకి వచ్చింది. లేఖ ఆధారంగా పోలీసులు సాధిక్ ఖాన్ పై కేసు నమోదు చేసి గత నెల 22న మీరట్ లో అరెస్టు చేశారు. 23న కాకినాడ తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు. అప్పటి నుంచి సాధిక్ ఖాన్ కాకినాడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్