ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపపంచకప్
బ్రూసెల్స్ (బెల్జియం): ఈనెల 15నుంచి జరిగే ఎఫ్‌ఐహెచ్ ప్రపంచకప్‌లో భారత మహిళలజట్టు కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. ఎఫ్‌ఐహెచ్ మంగళవారం విడుదల చేసిన డ్రాలో భారత మహిళలజట్టుకు పూల్-డిలో చోటు లభించింది. ఈ పూల్‌లో ఆసియా ఖండానికి చెందిన చైనాతోపాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. టోర్నీలో ఆడే మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆతిథ్య దేశాలైన బెల్జియంకు పూల్-సిలో నెదర్లాండ్స్ కు పూల్-ఎలో చోటు దక్కింది. ఈ రెండు దేశాలు ఈసారి ఎఫ్‌ఐహెచ్ ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ప్రతి పూల్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఇంటర్మీడియట్ రౌండ్(నాకౌట్)కు చేరుకుంటాయి.
పూల్స్...
ఎ: ఆస్ర్టేలియా, చిలీ, జపాన్, నెదర్లాండ్స్
బి: అర్జెంటీనా, జర్మనీ, స్కాట్లాండ్, అమెరికా
సి: బెల్జియం, స్పెయిన్, ఐర్లాండ్, న్యూజిలాండ్
డి: చైనా, ఇంగ్లండ్, ఇండియా, దక్షిణాఫ్రికా.








కామెంట్‌లు (0)