ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పిడిఎఫ్‌ టీచర్‌ ఎంఎల్ సిఅభ్యర్థులుగా హనుమంతరావు, గోపిమూర్తి

7 గంటల క్రితం

mlc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 09:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- గుంటూరు–కృష్ణ జిల్లాలకు ఎం.హనుమంతరావు.. ఉభయ గోదావరి జిల్లాలకు బొర్రా గోపిమూర్తి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గుంటూరు–కృష్ణ జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్ సి అభ్యర్థిగా ఎం హనుమంతరావును, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పిడిఎఫ్‌ ఉపాధ్యాయ ఎంఎల్ సి అభ్యర్థిగా ప్రస్తుత ఎంఎల్ సి బొర్రా గోపిమూర్తిని యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వచ్చే ఉపాధ్యాయ ఎంఎల్ సి ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థులుగా వీరిద్దరినీ బలపరచాలని నిర్ణయించింది. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సభలో యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఈ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన అభ్యర్థుల ప్రకటన సభలో పిడిఎఫ్‌ ఎంఎల్ సి బొర్రా గోపిమూర్తి, మాజీ ఎంఎల్ సిలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఉపాధ్యాయ ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం ఉన్న హనుమంతరావును ఎంఎల్ సిగా గెలిపించేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు కృషి చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన హనుమంతరావు వెంకటేశ్వర్లు, సుధీష్ణ దంపతుల కుమారుడు. 1996లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన ఆయన సెకండ్‌ గ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా, స్కూల్‌ అసిస్టెంట్‌గా, ఎఫ్‌ఎసి ప్రధానోపాధ్యాయుడిగా సుమారు మూడు దశాబ్దాలపాటు సేవలందించారు. 1996 నుంచి 2026 వరకు యుటిఎఫ్‌లో వివిధ బాధ్యతలను హనుమంతరావు సమర్థవంతంగా నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కోశాధికారిగా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్‌గా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమంలో క్రియాశీల నాయకుడిగా కొనసాగుతూ సిపిఎస్‌ రద్దు కోసం జరిగిన పోరాటాలతో పాటు విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగంపై జరుగుతున్న మార్పులకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్నారు.ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, హక్కుల సాధన కోసం సాగిన అనేక ఉద్యమాల్లో హనుమంతరావు భాగస్వామ్యమయ్యారు. సుదీర్ఘ ఉద్యమ అనుభవం, ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన, సంఘ నిర్మాణంలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను అభ్యర్థిగా ఎంపిక యుటిఎఫ్ ఎంపిక చేసింది.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్‌ ఎంఎల్ సి అభ్యర్థిగా ప్రస్తుత ఎంఎల్ సి బొర్రా గోపిమూర్తిని యుటిఎఫ్ మరోసారి బరిలో నిలబెట్టింది. గతంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై శాసనమండలిలో గళమెత్తిన గోపిమూర్తికే రెండోసారి అవకాశం కల్పించింది.

సిపిఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ సాధన, విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో గోపిమూర్తి చురుకైన పాత్ర పోషించారని పోషించారు. శాసనమండలిలోనూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రభుత్వ విద్యారంగ సమస్యలను ప్రస్తావిస్తూ పోరాడారని పేర్కొన్నారు. పిడిఎఫ్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎం హనుమంతరావు, బొర్రా గోపిమూర్తిలను గెలిపించేందుకు ఉపాధ్యాయులు ఐక్యంగా కృషి చేయాలి.సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయ ఉద్యమాలతో మమేకమైన అభ్యర్థులను ఎంఎల్ సిలుగా గెలిపించడం ద్వారా శాసనమండలిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యారంగ సమస్యలపై మరింత బలమైన స్వరం వినిపించే అవకాశం ఉంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్