గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక ఎన్నికల ను పోలీసులకు కాంట్రాక్ట్ ఇచ్చారా : సజ్జల రామకృష్ణారెడ్డి

3 రోజుల క్రితం

sajjala.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 03:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే దమ్ము టిడిపి కి లేదు

అందుకే పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికల నిర్వహణ

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా : స్థానిక ఎన్నికలు పోలీసులకు వైసిపి మధ్యనే పోరాటం జరుగుతున్నట్లుగా ఉందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలపై పోలీసులతో కొత్త పద్ధతుల్లో దాడి చేయిస్తుందని ఆరోపించారు. సోమవారం గుంటూరు సబ్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ములాఖత్‌లో కలిసిన అనంతరం, జైలు బయట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లు తలశిల రఘురాం, చంద్ర గిరి ఎసురత్నంతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేక చంద్రబాబు, నారా లోకేష్‌ స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యతను పోలీసులకు పీపీపి పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకోవడం వల్ల పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరుపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్స్‌ను తరలిస్తున్న వారిని అడ్డుకున్నందుకు తమ పార్టీ అభ్యర్థులను అభినందించాల్సింది పోయి, అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని 10 రోజులుగా జైలులో పెట్టడం దుర్మార్గమని ఆక్షేపించారు. బ్యాలెట్‌ బాక్స్‌ను ఎక్కడికో తీసుకెళ్తుంటే అడ్డుకుని మళ్లీ అధికారులకు అప్పగించే ప్రయత్నం మాత్రమే తమ నాయకులు, కార్యకర్తలు చేశారని చెప్పారు. వీడియోల్లో చూసినా ఇదే కనిపిస్తోందని, ఇందులో హత్యాయత్నం ఎక్కడుందని నిలదీశారు.మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత పెద్ద ఎత్తున నాశనం చేసిన ఘనత భారతదేశంలో ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు. పోలీసుల ద్వారా కొత్త పద్ధతుల్లో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారనీ ఆరోపించారు. పోలీసులు యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ, కలెక్టర్‌ స్టేట్‌మెంట్స్‌కు భిన్నంగా ఎఫ్‌ఐఆర్‌ రూపొందించారని చెప్పారు. బ్యాలెట్ బాక్స్ ను ఎటువంటి ఎస్కార్ట్ లేకుండా తీసుకు వెళుతున్న ఉద్యోగినీ ప్రశ్నిస్తే, బాలెట్ బాక్స్ దొంగతనం డెకాయిటీ, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లు పెట్టి జైలులో నిర్బంధించడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. పోలీసులు శాంతిభద్రతలను పట్టించుకోకుండా కిరాయి సైన్యంలా వ్యవహరిస్తున్నారనీ చెప్పారు. యూనిఫామ్‌లో ఉన్న పోలీసులు వెన్నుపోటు పార్టీ కార్యకర్తల్లా పని చేస్తుంటే.. పోలీసుల వెనక నిలబడిన ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో గెలిచినట్లు మీసాలు తిప్పుతున్నారనీ తెలిపారు. వైసిపి నాయకులు నూరి ఫాతిమా, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్