ప్రజాశక్తి-అమరావతి : మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను దూషించారంటూ నమోదైన కేసుల్లో యూట్యూబర్ బాచల్లూరి జోసెఫ్ అలియాస్ రావణ్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో హెబిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి ఆర్చ్ బిషప్ డాక్టర్ అశోక్‌బాబు చేగుడి అలియాస్ జోషువా డేనియల్, పాత్రికేయుడు మేకల భానుమూర్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రావణ్‌పై నమోదైన వరుస అరెస్టులు, నిర్బంధాన్ని చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి వెంటనే విడుదల చేయాలని, జూన్ 28న ఏలూరులో జరిగిన సభ ప్రసంగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఒకే ఎఫ్‌ఐఆర్‌గా పరిగణించాలని పిటిషన్‌లో కోరారు. సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఆధ్వర్యాన స్వతంత్ర విచారణ జరిపించాలని అభ్యర్థించారు.
యూట్యూబర్ రావణ్ అరెస్టుపై హెబిఎస్ కార్పస్ పిటిషన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 11:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)