కర్నూలు : ఎపిలోని కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున హెడ్ కానిస్టేబుల్ జాగింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి తెల్లవారుజామున బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనం వరప్రసాద్ రెడ్డిని ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన ఆయన తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ... హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చేపట్టారు.
జాగింగ్ చేస్తుండగా .. వాహనం ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి
14 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 11:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)