ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : మధురవాడ, గోపాలపట్నం ప్రాంతాలలో రోడ్ల పక్కన గల తోపుడు బండ్లను, బడ్డీలను తొలగించటాన్ని నిరసిస్తూ విశాఖ తోపుడు బండ్లు, చిల్లర వర్తక కార్మిక సంఘం (సిఐటియు ) ఆధ్వర్యంలో సోమవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి ఎ. సింహాచలం మాట్లాడుతూ ... తోపుడు బండ్లు చిల్లర వర్తకులకు రక్షణ కల్పించాలన్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసుల దాడులు ఆపాలన్నారు. చిరువర్తకులకు గుర్తింపు కార్డులు, హక్కు పత్రాలు ఇవ్వాలి అన్నారు. సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నారు. 2014 చిల్లర వర్తకల చట్టం ప్రకారం వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలన్నారు. హాకర్ జోన్స్ వద్ద మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. గుర్తింపు కార్డుల కోసం డబ్బు వసూలు చేసి కార్డులు ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తోపుడు బండ్ల కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలి : సిఐటియు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)