గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయ డెయిరీ ఛైర్మన్‌ ఎన్నిక చెల్లదు : ఎపి హైకోర్టు

3 రోజుల క్రితం

ap-high-court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • దాసరి వెంకట బాలవర్ధనరావుతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల ఎన్నిక కూడా రద్దు

ప్రజాశక్తి-విజయవాడ: కృష్ణా జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కోఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (విజయ డెయిరీ) పాలకవర్గ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నూతన ఛైర్మన్‌గా ఎన్నికైన దాసరి వెంకట బాలవర్ధనరావు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఆయనతో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నికలను కూడా చెల్లనివిగా ప్రకటించింది.

ఛైర్మన్‌, డైరెక్టర్ల ఎన్నికలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. దాసరి వెంకట బాలవర్ధనరావును మిల్క్‌ డైరెక్టర్‌ పదవికి అనర్హుడిగా ప్రకటించినట్లు సమాచారం. దీంతో ఆయన ఛైర్మన్‌ పదవిలో కొనసాగడంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విజయ డెయిరీ పాలకవర్గంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్