ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు..

1 గంట క్రితం

road acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 07:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నలుగురు యువకుల గల్లంతు

ప్రజాశక్తి-పశ్చిమగోదావరి : జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద అదుపుతప్పిన కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కారులో ఉన్న మరో యువకుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓగిడి గ్రామానికి చెందిన యువకులు తూర్పుగోదావరి జిల్లా మోరి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఐతంపూడి లాకుల సమీపంలోకి చేరుకోగానే కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పోతుల లక్ష్మీభాను (18), రాజారాం (17), నాగిరెడ్డి దుస్వంత్ (18), సాయి సూర్య (19) గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాల్వలో గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్