మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం

16 ఆగస్టు, 2026

gun-fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 07:51 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నిందితుడు స‌హా ఆరుగురు మృతి

- వర్జీనియా యూనివర్సిటీలోనూ కాల్పులు

వాషింగ్టన్‌ : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. మిచిగన్‌ రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నిందితుడు సహా ఆరుగురు మరణించారు. మృతుల్లో 16 ఏళ్ల బాలుడు సహా నలుగురు పెద్దలు ఉన్నారు. మరో 13 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. మిచిగన్‌ ‌పోలీసుల కథనం ప్రకారం... డెట్రాయిట్‌కు సుమారు 270 కిలోమీటర్ల దూరంలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 16 ఏళ్ల బాలుడు, 45 ఏళ్ల వ్యక్తి, 40 ఏళ్ల మహిళ మృతదేహాలను గుర్తించారు. అదే ఇంట్లో 13 ఏళ్ల బాలిక కూడా తుపాకీ గాయాలతో కనిపించింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడు చాడ్ హిక్‌మన్‌ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇంట్లో కాల్పులకు పాల్పడి ఒకరిని హ చేశాడు అదే సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతంలో 29 ఏళ్ల మహిళ మృతదేహం లభించింది. ఆమె మృతదేహం పక్కనే అనుమానితుడు చాడ్ హిక్‌మన్‌ మృతదేహం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో మృతిచెందిన వారందరూ తుపాకీ గాయాల కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. హిక్‌మన్‌ ఎలా మృతి చెందాడు..? కాల్పులకు కారణమేంటి? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

​వర్జీనియా యూనివర్సిటీలోనూ కాల్పుల..

అమెరికా వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున రెసిడెన్స్ హాళ్ల సమీపంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు గాయపడగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఓ యూనివర్సిటీ విద్యార్థి ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాంపస్‌లో లాక్‌డౌన్ విధించి, అనంతరం దాన్ని ఎత్తివేశారు. క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాల్పులకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్