ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘోర రోడ్డు ప్రమాదం..మంత్రి కారు డ్రైవర్‌ మృతి

06 అక్టోబర్, 2026

acident.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 09:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చిలకలూరిపేట: పోల్‌రెడ్డిపాలెం బైపాస్‌ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కారు డ్రైవర్‌ పసుమర్రు గ్రామానికి చెందిన శ్రీహరి (40) మృతి చెందారు. కారు–బైక్‌ ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. శ్రీహరి విధులు ముగించుకుని 52 ఎకరాల టిడ్కో గృహాల నుంచి వైఎస్సార్‌ కాలనీ వైపు వెళ్లే సర్వీసు రోడ్డులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు, సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్