గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నివేదిక పరిశీలన దశలో రిజర్వేషన్లు ఎలా?

09 సెప్టెంబర్, 2026

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 12:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి బిసిల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెబుతూ, అదే నివేదికలోని గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. నివేదికను ఎప్పుడు పరిశీలిస్తారని, దాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించింది. రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించిన ప్రాతిపదిక, కమిషన్‌ నివేదికలోని పూర్తి గణాంకాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని ఎలా సమర్థించుకుంటారో వివరించాలని పేర్కొంది. బిసి రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్‌ లీసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్