శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరిలయన్స్‌కు ఎలా కట్టబెడతారు?

22 గంటల క్రితం

WhatsApp Image 2026-08-28 at 4.29.01 PM.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 11:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రతిపాదిత బొగ్గు గని నిర్ణయాలు తగవు

  • ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌‌రెడ్డి డిమాండ్‌

  • వాస్తవాలు వెల్లడించాలి : రైతులు

ప్రజాశక్తి -చింతలపూడి : ప్రతిపాదిత బొగ్గు గని (యుసిజి)కి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డిపిఆర్) ప్రకటించాలని, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలు తగవని, ప్రజా సంపదను రిలయన్స్ కంపెనీకి ఏ విధంగా కట్టబెడతారని, బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తిపై వాస్తవాలను ప్రజలకు, రైతులకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు._శుక్రవారం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్లలోని గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పాయింట్ సమీపంలో ప్రతిపాదిత బొగ్గు గని ప్రాంత రైతులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం అనంతరం బొగ్గు గని పరిశోధన కోసం 40 సంవత్సరాల క్రితం వేసిన బోరును రైతు, ప్రజా సంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతిపాదిత బొగ్గు గని ప్రాంతంలో రైతులు, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా రిలయన్స్ కంపెనీ బొగ్గు ఆధారిత గ్యాస్ ఉత్పత్తి చేస్తుందని ప్రభుత్వాలు ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని మాటలు చెబుతూ ఆచరణలో జరిగే విధ్వంసం గురించి ప్రజలకు, రైతులకు వాస్తవాలు చెప్పకపోవడం అన్యాయమన్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి, అరటి, మొక్కజొన్న, వరి, ఇతర అనేక ఉద్యాన, వాణిజ్య, ఆహార పంటలు పండుతున్నాయని, సస్యశ్యామలంగా ఉన్న ఈ ప్రాంతంలో బొగ్గు ఆధారంగా గ్యాస్ ఉత్పత్తి వల్ల పర్యావరణ ముప్పు ఇతర అంశాలపై వాస్తవ విషయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. బొగ్గు గని ప్రతిపాదిత ప్రాంత రైతులు చిక్కాల శ్రీనివాసరావు, కొండు బోయిన శివరామకృష్ణ, బాణావతి ఆలీ, పి.చక్రధరరావు, కొనకళ్ల రాఘవరావు మాట్లాడుతూ... రిలయన్స్ కంపెనీకి తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తమ జీవనాన్ని, తమ గ్రామాల అభివృద్ధిని నాశనం చేస్తే ఒప్పుకునేది లేదన్నారు. వాస్తవ విషయాలు ప్రభుత్వాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. డిపిఆర్‌ ‌ప్రకటించాలని, ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ముందుకు వెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తొర్లపాటి బాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి కనుమత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి డి.సత్యనారాయణ ఆయా సంఘాల నాయకులు పి.పాండురంగారావు, పి.ముత్తారెడ్డి, జె.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్