బాలనటుడు అర్జున్ నటిస్తున్న ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రం నుంచి ‘అరెరె ఐదయ్యిందే’ అనే సెకండ్ సింగిల్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. దర్శకుడు శ్రీకర్ నయాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన సొంత బ్యానర్ ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్’పై నిర్మిస్తున్నారు. ఈ పాటను గాయకుడు విశ్వదత్తా ఆలపించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, జయసుధ, వాసుకి ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.








కామెంట్‌లు (0)