శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జానపద గాయకుడు కిట్టు హీరోగా..

1 గంట క్రితం

kittupavan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 08:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జానపద పాటలతో ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఎం.ఎస్. వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా పతాకాలపై ప్రొడక్షన్‌ నం. 3గా ముని శివ, శివమల్లాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు దిలీప్‌ సాయి నాయక్‌ తెరకెక్కిస్తున్నారు. మాదాపూర్‌లోని శివమ్‌ మీడియా కార్యాలయంలో శనివారం ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత చంద్రబోస్‌, దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌, నేషనల్‌ అవార్డు విన్నర్‌ సతీష్‌ వేగేశ్న, బిగ్‌ టీవీ చైర్మన్‌ విజయ్‌ రెడ్డి వెన్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సతీష్‌ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్‌ దర్శకుడు దిలీప్‌కు స్క్రిప్ట్‌ అందించారు. చంద్రబోస్‌ హీరో కిట్టుపై క్లాప్‌ కొట్టారు. ఆర్‌.పి. పట్నాయక్‌ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, విజయ్‌ రెడ్డి కెమెరా స్విచాన్‌ చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. చంద్రబోస్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ టీమ్‌ గురించి నాకు చాలా బాగా తెలుసు. వారందరూ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో కిట్టు మాట్లాడుతూ.. ‘‘నేను చాలా చిన్న నటుడిగా ఫోక్‌ సాంగ్స్‌ చేసేవాడిని. అలాంటిది నేను చేస్తున్న ఈ సినిమాకు ఇంత పెద్దవాళ్లు వచ్చి సపోర్ట్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్