గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తలు దుర్మరణం

2 గంటల క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 07:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వినుకొండ: రోడ్డు ప్రమాదంలో భార్య భర్త మృతి చెందిన సంఘటన వినుకొండ పట్టణం వెల్లటూరు రోడ్డులోని హనుమాన్ నగర్ వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న వల్లూరి సావిత్రి (55), ఆమె భర్త రవి (59) ఇద్దరు మిద్దె బావి కాలనీ హీరోని తన కూతురు ఇంటి నుండి మోటార్ సైకిల్ పై వస్తుండగా హనుమాన్ నగర్ వద్ద వెనుక నుండి వేగంగా వస్తున్న టాటా ఏసీ బొలోరో వాహనం ఢీకొట్టడంతో భార్య భర్తలు తలకు బలమైన గాయాలు అపస్ మార్కెట్లో పడిపోయారు. 108 ద్వారా క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొన ఊపిరితో ఉన్న ఇరువురు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న వినుకొండ పట్టణ సిఐ బి ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలకు తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్