శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరో అంతస్తు నుండి దూకి.. ట్రిపుల్ ఐటి విద్యార్థి ఆత్మహత్య

2 గంటల క్రితం

IIIT student commits suicide by jumping from the sixth floor.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో శనివారం బి.టెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అభిరూప్‌ (20) అనే విద్యార్థి ఇన్‌స్టిట్యూట్ ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి గచ్చిబౌలి పోలీసులు చేరుకున్నారు. మృతుడిని ఖమ్మం వాసి అయిన అభిరూప్‌గా గుర్తించారు. అతను ఆ సంస్థలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ప్రాథమిక నివేదికల ప్రకారం ... అతను క్యాంపస్ భవనంలోని ఆరవ అంతస్తు నుంచి దూకేశాడు. అభిరూప్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు చదువు ఒత్తిడి, మరోవైపు అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆరో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అభిరూప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్