ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "నేతన్నల సేవలో" పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద దారిద్ర్య రేఖ కింద ఉన్న ప్రతి అర్హత కలిగిన చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. చేనేత కార్మికులు తమకు అవసరమైన నూలు, రంగులు, రసాయనాలు కొనుగోలు చేయడం, మగ్గాల మరమ్మతులు, ఆధునికీకరణ చేపట్టడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెంచుకుని వారి ఆదాయాన్ని మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. పవర్‌లూమ్ రంగంతో పోటీ పడేలా చేనేత రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకాన్ని పొందేందుకు చేనేతనే జీవనాధారంగా చేసుకున్న వారుచేనేత శాఖ డేటాబేస్‌లో తమ పేర్లను నమోదు చేసుకుని ఉండాలి. కేవలంబిపిఎల్ కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నా ఒక్కసారే ప్రయోజనం ఉంటుందని, కుటుంబ పెద్ద పేరుతో డిబిటి ద్వారా రూ.25,000 జమ చేస్తా రని పేర్కొన్నారు.ఈ పథకానికి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి అదే శాఖ ద్వారా అమలు చేస్తారు. అర్హుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించి జిల్లా కలెక్టర్ల ఆమోదంతో జాబితాలు సిద్ధం చేస్తారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 51,952 చేనేత కుటుంబాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి.
Print Editionనేతన్నల సేవలో.. జిఓ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 11:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)