గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశ్రీశైలానికి చేరుతున్న నీటి ప్రవాహం

1 గంట క్రితం

srishilama-dam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్టు :కృష్ణ ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతుంది. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ఎగువ జూరాల నుంచి విద్యుత్తు ఉత్పాదన ద్వారా 40,385 వేల క్యూసెక్కులు, గేట్ల నుంచి 41,520 వేల క్యూసెక్కులతో కలిపి 81,905 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాయి. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 875.50 అడుగులుగా ఉంది. జలాశయంలో నీటి నిల్వ సామర్ధ్యం215 టిఎంసిలకు గాను ప్రస్తుతం 165.9244 టిఎంసిలుగా నమోదైంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 3,050 వేల క్యూసెక్కులు, మల్యాల కెసిసికి 325 క్యూసెక్కులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు 2,355 వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గడచిన 24 గంటలలో 31,115 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 17.622 మిలియన్ యూనిట్ల విద్యుత్తును, కుడిగట్టు జల విద్యుత్తు కేంద్రంలో 2,158 వేల క్యూసెక్కుల నీటితో 3.985 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదనలు చేశారు. సాయంత్రం సమయానికి కుడిగట్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి దిగువ నాగార్జునసాగర్ కు 35,315 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి మొత్తం 49,046 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్