సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢీల్లీ ఉద్యమ స్పూర్తితో ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకుంటాం

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- విద్యార్దులు ఉద్యమంపై కేంద్రం నిరంకుశ వైఖరిపై ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో

- కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర ప్రభుత్వం విద్యార్ది ఉద్యమంపై అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి విడనాడాలని, ఢీల్లీలో జరిగిన విద్యార్ది ఉద్యమం స్పూర్తితో ప్రభుత్వ

విద్యారంగాన్ని కాపాడుకుంతమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చినబాబు, డి.రాములు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. దీక్షను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన విద్యార్ది ఉద్యమం కారణంగా దేశ వ్యాప్తంగా విద్యార్ది ఉద్యమం పట్ల కక్ష పూరిత చర్యలకు పాల్పడుతుందన్నారు. ఢీల్లీలో ఎస్ ఎఫ్ ఐ నాయకులను అరెస్టులు చేయడం, నిర్బంధాలకు పాల్పడుతుందన్నారు. దేశంలో రాష్ట్రంలో కూడా విద్యార్ది సంఘాలను విద్యా సంస్థలలోకి నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. విద్యార్దులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియాలంటే విద్యారులను కలవడం ద్వారానే తెలుస్తాయని అటువంటి అవకాశం లేకుండా విద్యా సంస్థల్లోకి వెళ్లకుండా నిరంకుశంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో విద్యార్దులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకోవడం కోసం ఢీల్లీ ఉద్యమ స్పూర్తితో ఉద్యమని హెచ్చరించారు. నిరసన దీక్షలో విద్యార్ది యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్