పార్టీ పరంగా 34 శాతం సీట్లు బిసిలకు ఇస్తాం
టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చట్టపరంగా బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవకాశం లేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ పరంగా 34 శాతానికి పైగా టికెట్లు కేటాయించి బిసిలకు సముచిత ప్రాతినిధ్యిం కల్పిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ, రాజకీయంగా న్యాయం చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను వైసిపి అడ్డుకొని వారి రాజకీయ ప్రాతినిధ్యానికి విఘాతం కలిగించారని విమర్శించారు. బిసిలకు సముచిత స్థానం కల్పించింది టిడిపి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. బిసి రిజర్వేషన్లపై వైసిపి విధానం ఏమిటో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు వేర్వేరు సమావేశాల్లో ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)