మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవివేకా కేసులో అంతిమ లబ్ధిదారు జగనే :మంత్రి అనగాని

6 గంటల క్రితం

anagani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 10:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ఎంపి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అంతిమ లబ్ధిదారుడు వైసిపి అధినేత జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డే అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మంగళవారం మాట్లాడుతూ ఇడి, సిబిఐ దర్యాప్తు ముమ్మరం కావడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ ధర్నాల పేరిట కొత్త పల్లవి అందుకున్నారని చెప్పారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి, సునీల్ యాదవ్ వెల్లడించిన వాస్తవాలు, రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలన్నీ తాడేపల్లి ప్యాలెస్‌ వైపే వేలెత్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతోనే డిఎస్సి వంటి అంశాలపై వైసిపి అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయుడు కాకుమాను రాజశేఖర్‌ను ధర్నాకు బలవంతంగా పిలిపించి, ఆయన మృతికి కారకులయ్యారని తెలిపారు. ఇప్పుడు ఆ మరణంపై కూడా శవ రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తూ ఇతరులపై ఎదురుదాడికి దిగడం వైసిపికి అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా జగన్ మీడియా ముందుకు వచ్చి వివేకా హత్యపై వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను కూడా తమ ప్రభుత్వం పరిష్కరించి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని ఈ సందర్భంగా అగనాని హామీ ఇచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్