ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మావోయిజం ప్రభావం ఇక లేదు : డిజిపి సివి ఆనంద్‌

1 గంట క్రితం

Maoism no longer has an impact: DGP CV Anand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వరంగల్‌ : రాష్ట్రంలో మావోయిస్టుల ప్రముఖులతోపాటు క్యాడర్‌ లొంగిపోవడంతో మావోయిజం ప్రభావం ఇక లేదని డిజిపి సివి ఆనంద్‌ అన్నారు. నేడు డ్రగ్స్‌ సమస్య ప్రధానంగా ఉందని వెల్లడించారు. ఆదివారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ .... తన ట్రైనీ ఐపిఎస్‌ వరంగల్‌ నుంచే ప్రారంభమయ్యిందని గుర్తు చేశారు. ఆ రోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి వస్తామా అన్నంతగా నక్సల్స్‌ ప్రభావం ఉండేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2010 నుంచి మావోయిజం తగ్గిందని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులతో ములుగులో సోమవారం ఒక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. లొంగిపోయిన, మావోయిస్టుల బాధితుల కోసం ఒక యాప్ తయారు చేశామని వెల్లడించారు. 1992-96 మధ్య చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా కొంత తక్కువ వచ్చిందని తమ దృష్టికి వచ్చిందని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. నార్కొటిక్ బ్యూరో, ట్రాఫిక్, సిఐడి కి చెందిన వారితో కలసి ఒక బృందంగా ఏర్పడి జిల్లాల పర్యటనలు చేస్తున్నామని డిజిపి ఆనంద్‌ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్