ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ : డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్‌పై మచిలీపట్నం ఇనకుదురు పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా కాకినాడ సర్పవరం నుంచి శుక్రవారం తెల్లవారుజామున మచిలీపట్నం తీసుకువచ్చారు. ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్లో రావణ్ ఉన్న విషయం తెలుసుకున్న జనసైనికులు, మహిళలు పెద్ద సంఖ్యలో వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న గోడ దూకి స్టేషన్‌లోకి వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ జవాన్లు, మహిళా పోలీస్ సిబ్బంది బలవంతంగా రోడ్డు బయటకు నెట్టుకెళ్లి స్టేషన్ గేట్లు మూసివేసి కట్టుదిట్టమైన భద్రత నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో రావణకు రాచమర్యాదలు చేస్తున్నారని, వైసిపి నాయకులను పరామర్శలకు అనుమతిస్తున్నారని జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం నడుస్తుందా? టిడిపి కూటమి ప్రభుత్వం ఉందా? అని బహిరంగంగా విమర్శలు చేశారు. శుక్రవారం సాయంత్రానికి చిలకలపూడి సిఐ అబ్దుల్ నబి, ఇనకుదురుపేట సిఐ పరమేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు నాటకీయంగా నల్లటి బట్టలు వేసి మాస్క్ తగిలించి ఉన్న వ్యక్తిని రావణుని స్థానంలో ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్లుగా వ్యాన్ ఎక్కించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఎక్కడా దాడులు జరగకుండా అవరోధాలు లేకుండా వ్యాన్ ఎమ్మార్ ఫంక్షన్ హాల్ మీదుగా ప్రభుత్వాస్పత్రికి చేరుకోవడంతో అప్పుడు రెండో ప్రయత్నంలో రావణ్‌ను ప్రభుత్వాస్పత్రికి చికిత్సల కోసం తరలించారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. రావణ్ తరఫున జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఒకవేళ వాదనల అనంతరం న్యాయమూర్తి రావణ్ కు బెయిల్ మంజూరు చేస్తే వెంటనే గుడివాడ పోలీసులు అరెస్ట్ చేయడానికి కోర్టు పరిసరాలలో నిరీక్షిస్తున్నారు.
బందరులో రావణ్‌పై దాడికి జనసైనికుల యత్నం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)