గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిఆర్‌ఎస్‌ అక్రమాలను బయటపెడుతున్న కవిత : వేములవాడ ఎమ్మెల్యే

4 రోజుల క్రితం

adi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 04:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : బిఆర్‌ఎస్‌ అక్రమాలను కవిత బయటపెడుతున్నారని ప్రభుత్వ విప్‌, మేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనను కవిత దగ్గరుండి చూశారని, ఆ పార్టీ అక్రమాలను ఇప్పుడు బయటపెడుతున్నారని అన్నారు. మల్లన్న సాగర్‌ నుండి కెసిఆర్‌ ఫామ్‌హౌస్‌ వరకు కాలువ ఉందని కవిత చెబుతున్నారని, తన తండ్రి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అంటున్నారని అన్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా గత ప్రభుత్వ అక్రమాలను వెల్లడిస్తున్నారని, ప్రగతి భవన్‌, ఫామ్‌హౌస్‌లో స్వయంగా చూసిన అంశాలనే ఆమె చెబుతున్నారని అన్నారు. కవిత ప్రశ్నలు, ఆరోపణలకు హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.50 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసిందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్