మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అశ్రునయనాల‌తో కిరణ్‌ అంత్యక్రియలు

10 గంటల క్రితం

అశ్రునయనాల‌తో కిరణ్‌ అంత్యక్రియలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 09:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

-పలువురు ప్రముఖులు, రాజకీయ నేతల ఘననివాళి

ప్రజాశక్తి– కర్నూలు కార్పొరేషన్‌ : కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సిపిఎం నాయకులు, కార్యకర్తల అశ్రునయనాలు, కన్నీటి పర్యంతం మధ్య మాజీ ఎమ్మెల్యే ఎంఎ.గఫూర్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల దంపతుల పెద్ద కుమారుడు పివి.కిరణ్‌ అంత్యక్రియలు సోమవారం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లెలో జరిగాయి. విషాదంలో మునిగిన కుటుంబాన్ని పరామర్శించేందుకు, కిరణ్‌‌కు తుది వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కర్నూలులో ప్రముఖుల నివాళి

అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కిరణ్‌

గుండెపోటుతో ఈ నెల ఒకటిన అక్కడే మరణించారు. ఆయన భౌతికకాయం సోమవారం తెల్లవారుజామున కర్నూలుకు చేరుకుంది. ప్రజల సందర్శనార్థం సిపిఎం కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో భౌతికకాయాన్ని ఉంచారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కిరణ్‌ భౌతికకాయంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి. భరత్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. గఫూర్‌, నిర్మలతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కె.ప్రభాకర్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, వి.రాంభూపాల్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు, ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బి.సావిత్రి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్ కుమార్, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌, ఆవాజ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ఎ.సుభాన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ.చిస్తీ, మాజీ ఎమ్మెల్యేలు మణి గాంధీ, ఎస్‌వి.మోహన్‌రెడ్డి, వైసిపి మహిళా విభాగం రాష్ట్ర నాయకులు ఎస్‌వి.విజయ మనోహరి, కెడిసిసిబి ఛైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం (దాసరి భవనం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వై.జయరాజు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ శంకర్‌ శర్మ, గుండె వైద్య నిపుణులు మాలకొండయ్య, తెలంగాణకు చెందిన పలువురు నాయకులు కిరణ్‌కు నివాళులర్పించారు.

సంగినేనిపల్లెలో అంతిమ వీడ్కోలు

కర్నూలులో నివాళి అనంతరం సోమవారం మధ్యాహ్నం కిరణ్‌ భౌతికకాయాన్ని ఆయన తల్లి నిర్మల స్వగ్రామమైన తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లెకు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, సిపిఎం నాయకులు, కార్యకర్తల సమక్షంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌, సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పాల్గొన్నారు. కర్నూలు, నంద్యాల, వనపర్తి జిల్లాల నుంచి సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్