ప్రజాశక్తి - తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా జరిగింది. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఇఒ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు, సివిఎస్‌ఒ మురళీకృష్ణ, డిప్యూటీ ఇఒ భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.
Print Editionతిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
57 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 09:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)