ఎపిసిపిడిసిఎల్ సిఎమ్‌డి పుల్లారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఎపిసిపిడిసిఎల్ సిఎమ్‌డి పి పుల్లారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. మండపాలను విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు తెలిపారు. 500 వాట్లకు రూ.వెయ్యి, వెయ్యి వాట్లకు రూ.2,250 చొప్పున తాత్కాలిక విద్యుత్ సరఫరా రుసుము చెల్లించాలన్నారు. దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.ఇందుకోసం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలు, ఎపిసిపిడిసిఎల్ వెబ్‌సైట్ apcpdcl.inలో, మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.








కామెంట్‌లు (0)