టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్కెల్
శ్రీలంకతో 15నుంచి తొలి టెస్ట్
గాలే: శ్రీలంక పిచ్‌లపై భారత పేసర్లు వికెట్లు సాధించాలంటే చెమటోడ్చాల్సిందేనని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. లంక పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలమని, ఫాస్ట్ బౌలర్లకు కఠిన సవాళ్లు ఎదురుకావడం ఖాయమని, వాటిని అధిగమించాలంటే త్వరగా పరిస్థితులకు అలవాటుపడాలని సూచించాడు. లంకలోని తీవ్రమైన వేడి, ఉక్కపోతతో పాటు కుకబుర్రా బంతి స్వరూపం మారడాన్ని అర్థం చేసుకుని, ఒత్తిడిని సృష్టించేందుకు సృజనాత్మకంగా ఆలోచించడం చాలా కీలకమని ఆయన స్పష్టం చేశారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో భారత పేసర్లు తీవ్రతను కొనసాగించడం అత్యవసరమని మోర్కెల్ పేర్కొన్నారు. కీలక పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మోకాలి గాయంతో ఈ సిరీస్‌కు దూరం కావడంతో భారత పేస్ దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, దీంతో మహమ్మద్ సిరాజ్ అనుభవజ్ఞు డైన పేసర్‌గా మారాడని, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని తెలిపాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన అకిబ్ నబీలతో భారత పేస్ దళంతో కలిసినా.. ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో తొలి టెస్టుకు సిద్ధమవుతామన్నాడు.
భారత టెస్టు జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్పరాజ్‌ఖాన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ జైన్.








కామెంట్‌లు (0)