ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘నేతన్నల సేవ’లో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని, సాంకేతిక కారణాల రీత్యా కొందరి వివరాలు ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అందిస్తామని గురువారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే పలువురు నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామని, అర్హులైన నేతన్నలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వదంతులు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, ఏమైనా అనుమానాలు ఉంటే సమీపంలో చేనేత, జౌళి శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు.
Print Editionకొత్త దరఖాస్తుదారులకు 20లోగా ‘నేతన్నల సేవ’ సాయం : మంత్రి సవిత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)