బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దుర్గగుడిలో ‘లడ్డూ ఏటీఎం’ ప్రారంభం

1 గంట క్రితం

దుర్గగుడిలో ‘లడ్డూ ఏటీఎం’ ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 07:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-విజయవాడ సిటీ: రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన ‘లడ్డూ ప్రసాదం ఎటిఎం’ను దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ బుధవారం ప్రారంభించారు. యుపిఐ ద్వారా చెల్లించి క్షణాల్లో లడ్డూ పొందేలా యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నకిలీ పూజా టికెట్లపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని, దళారులను నమ్మకుండా అధికారిక మార్గాల్లోనే టికెట్లు పొందాలని సూచించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదం, భద్రతపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్