శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

12,13 తేదీల్లో విజయవాడలో సాహిత్య సమ్మేళనం

1 గంట క్రితం

తెలకపల్లి రవి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 08:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రముఖ కవి తెలకపల్లి రవి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఈ నెల 12 13 తేదీల్లో సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ కవి, సీనియర్‌ ‌పాత్రికేయులు తెలకపల్లి రవి వెల్లడించారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సమ్మేళనం జరుగుతుందని తెలిపారు. విజయవాడలోని బాలోత్సవ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతరం గొంతు వినిపించడానికి సాహితీ స్రవంతి ప్రయత్నం చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే యువతకు సంబంధించిన సృజన, రచనలు మెరుగుపరిచి, చర్చించి, వారి అనుభవాలు, అభిప్రాయాలను కలబోసుకోవడానికి ఈ సాహితీ సమ్మేళనం వేదికగా ఉండబోతుందన్నారు. విజయవాడలో పాతికేళ్ల తర్వాత మళ్లీ ఈ సాహిత్య కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో లౌకిక విలువలు, సామాజిక న్యాయం కోసం నిలబడే సందర్భంలో ఒక ప్రత్యేకమైన సందర్భంగా సాహిత్య ప్రస్థావనం పత్రికల్లో, వివిధ రూపాల్లోనూ తెలుగు భాషాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సాహిత్యం ప్రభువుల తరపున కాకుండా ప్రజల తరపునా నిలబడాలనేది బమ్మెర పొతన నుంచి కొనసాగుతోందన్నారు. సాహిత్యానికి సోషల్ మీడియా ఒక వేదకని తెలిపారు. ఈ సభను జయప్రదం చేయడం ద్వారా తెలుగు భాషా సంస్కృతి, సమాజంలో దోపిడీ, అన్యాయాలు, పాలకులు, పాలక వర్గాల దౌర్జన్యాల మీద జరిగే పోరాటాలు, ఉద్యమాలకు మద్దతుగా అక్షర సాహిత్యాన్ని తీర్చిదిద్దేటటువంటి ప్రక్రియగా ఈ కార్యక్రమం జరగబోతోందన్నారు.

సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ మాట్లాడుతూ ఈనెల 12న ప్రారంభోపన్యాసం రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, వర్తమాన సాహిత్యం వివిధ వాదాలు పై కోయి కోటేశ్వరరావు, సాహిత్య చరిత్ర, వివిధ దృక్పథాలు తెలకపల్లి రవి, ప్రపంచీకరణ, ప్రతిఘటనా సాహిత్యం ను ఖాదర్ మొహీయుద్దీన్ వివరిస్తారన్నారు. రెండు రోజుల పాటు ఐదు సెషన్లలో జరిగే ఈ సమ్మేళనంలో పలువురు పాల్గొంటారని వివరించారు. ఈ సమావేశంలో జాషువా సంస్కృతిక వేదిక నుంచి గుండు నారాయణరావు, ప్రస్థానం పత్రిక ఎడిటర్ సత్యాజీ, ఎంబివికె బాధ్యులు టి.క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్