శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దసరా, సంక్రాతి బరిలో వెంకీ

2 గంటల క్రితం

venky
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 09:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం చిత్రాలు సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లలో విడుదలవుతుంటాయి. ఈ సీజన్లలోనే స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే వెంకటేష్ మాత్రం వరుసగా రెండు ప్రధాన సీజన్లను టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. 'ఆదర్శ కుటుంబం' చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో వెంకటేష్ వరుసగా దసరా, సంక్రాంతి సీజన్లను టార్గెట్ చేసినట్లు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్