శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు, రేపు సాహిత్య సమ్మేళనం

1 గంట క్రితం

Literary gathering today and tomorrow
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 11:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఈనెల 11, 12 తేదీల్లో జాతీయ తెలుగు సాహిత్య సమ్మేళనం జరగనుంది. ఇక్కడి మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమ్మేళనంలో చాలా పెద్ద సంఖ్యలో ప్రముఖ కవులు, రచయితలు పాల్గొననున్నారు. శనివారం ప్రారంభ సభకు తెలకపల్లి రవి అధ్యక్షత వహిస్తారు. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తారు. శనివారం మొదటి సెషన్ లో "కవిత్వ నిర్మాణం- వస్తు శిల్పాలు" పై గుంటూరు లక్ష్మీనరసయ్య, "వర్తమాన సాహిత్యం - వివిధ వాదాలు" పై డాక్టర్ కోయి కోటేశ్వరరావు ప్రసంగిస్తారు. రెండో సెషన్ లో "సాహిత్య చరిత్ర వివిధ దృక్పథాలు" పై తెలకపల్లి రవి, "ప్రపంచీకరణ ప్రతిఘటన సాహిత్యం'పై ఖాదర్ మోహిద్దీన్ ప్రసంగిస్తారు. మూడో సెషన్ లో పలువురు కవులు, రచయితలు తాము రచనలు ఎందుకు చేస్తున్నాం అనే విషయమై తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఆదివారం జరిగే మొదటి సెషన్ లో "తెలుగు కథ - సామాజిక చింతన"పై అట్టాడ అప్పలనాయుడు, "కథారచన మెళకువలు"పై మహమ్మద్ ఖదీర్ బాబు, "కవులు, రచయితలు అధ్యయనం ఆవశ్యకత పై ఆర్.సీతారాం ప్రసంగిస్తారు. రెండో సెషన్ లో పలువురు రచయితలు, కవులు తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. భోజనానంతరం ప్రసిద్ధ సాహితీవేత్తలతో యువ కవులు, రచయితల ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. వక్తలుగా ఎం.వి.ఎస్.శర్మ, పిన్నమనేని మురళీకృష్ణ, కే సత్య రంజన్ తదితరులు పాల్గొంటారు. సమ్మేళనానికి హాజరయ్యేవారి సౌకర్యార్థం జిల్లాల వారీగా స్పాట్ రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. -

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్