శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

క్రేజ్‌ను క్యాష్ చేసుకోనున్న ఫిఫా: 'పీస్ ఆఫ్ ది పిచ్' ఫైనల్ మ్యాచ్ పిచ్ విక్రయం..!

2 గంటల క్రితం

New Jersey’s MetLife Stadium
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 01:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఫిఫా ప్రపంచకప్ 2026 క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఉపయోగించే మైదానాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి 'పీస్ ఆఫ్ ది పిచ్' పేరుతో డిజిటల్ స్టోర్ ద్వారా అభిమానులకు విక్రయించనుంది. ఇందులో భాగంగా ‘ఫౌండేషన్ ఎడిషన్’ కింద లభించే ఒక్కో గడ్డి ముక్క ధరను 450 డాలర్లు (సుమారు రూ. 43,000) గా నిర్ణయించారు. ఈ ముక్కలు పాడవకుండా ఉండేలా ప్రీమియం యాక్రిలిక్ డిస్‌ప్లే బాక్స్, అథెంటిసిటీ ఫిల్మ్, ప్రత్యేక యూఎస్‌బీ మెమొరీ స్టిక్‌తో కలిపి లగ్జరీ ప్యాకింగ్‌లో అందించనున్నారు. అలాగే అత్యంత ఖరీదైన టాప్ టైర్ గడ్డి ముక్కల ప్యాకేజీ ధర 3 వేల డాలర్లు (సుమారు రూ. 2.8 లక్షలు)గా ఉండనుంది. కాగా, ఈ పిచ్ అమ్మకాల ద్వారా ఫిఫా మొత్తం 11 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 92 కోట్లు) ఆదాయాన్ని రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్