mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బెంగాల్ సిఎం సువేందు అధికారితో మంత్రి నారా లోకేష్ భేటీ

11 గంటల క్రితం

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 01:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కోల్ కతాకు గురువారం వెళ్లిన మంత్రి ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సిఎంను కలిసి మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం గురించి లోకేష్ వివరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి గరిష్ట ప్రయోజనంతో కూడిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి పారదర్శకంగా అందజేస్తున్న విధానాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. పశ్చిమ బెంగాల్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న డిజిటల్ గవర్నెన్స్, రియల్-టైమ్ మానిటరింగ్ ఫలితాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ - పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేద్దామని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలని, తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి అన్ని విధాలా సాయం అందిస్తామని సిఎంకు విన్నవించారు. మత్స్య సంపద పెంపు, ఎగుమతుల విషయంలో పరస్పర సహకారంతో మరింత అభివృద్ది సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలపై పశ్చిమ బెంగాల్ సిఎం సానుకూలంగా స్పందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్