ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు (మంగళవారం) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దాని ప్రభావంతో రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతోందని, సిక్కిం నుంచి పూర్తిగా, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వైదొలిగినట్లు తెలిపింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, గోవాలోని మిగిలిన ప్రాంతాలతోపాటు ఒడిశా, తెలంగాణ, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని పేర్కొంది. మరో రెండు మూడు రోజుల్లో దక్షిణ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 10:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)