పంజాబ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ పంజాబ్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పంజాబ్‌ను మాదకద్రవ్యాలు, బెదిరింపులు, గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలు, అవినీతి నుంచి విముక్తి చేసి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నచిన్న రాజకీయ ప్రయోజనాలు, రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తన పోస్టులో పేర్కొన్నారు. పంజాబ్‌ను తిరిగి ప్రగతిశీల, ప్రజలు ప్రేమించే రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఆయన రాజీనామాతో పంజాబ్ రాజకీయాల్లో చర్చ మొదలైంది.
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే రాజీనామా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 10:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)