సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

1 గంట క్రితం

road
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 11:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆరుగురు మృతి, ఇద్దరికి గాయాలు

కుషినగర్‌: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుషినగర్‌లోని థరువా డిహ్ ప్రాంతం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఓమ్నీ వ్యాన్, ట్రైలర్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్