సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

23న అల్పపీడనం

21 అక్టోబర్, 2026

weather
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 08:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- భాతర వాతావరణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: తమిళనాడు తీరానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, థాయిలాండ్ గల్ఫ్, దానిని ఆనుకుని ఉన్న థాయిలాండ్, మయన్మార్ ప్రాంతాల్లోని నిస్పటి ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, ఆ తర్వాత పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం.వెంకట్రావు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ, తదుపరి 3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. వీటి ఫలితంగా కోస్త ఆంధ్రప్రదేశ్‌, యానాం, రాలయసీమల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి, రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందన్నారు. బలమైన ఈదురు గాలులు గంటలకు 30 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్