శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమద్యం ఆదాయం కోసం గీత వృత్తిని నిర్వీర్యం చేస్తే సహించం

8 గంటల క్రితం

మద్యం ఆదాయం కోసం  
  గీత వృత్తిని నిర్వీర్యం చేస్తే సహించం
​- ఎపి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి
- మోకులు ధరించి భారీ ప్రదర్శన
- ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి.. కల్లు పారబోసి నిరసన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎపి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి

  • మోకులు ధరించి భారీ ప్రదర్శన

  • ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి.. కల్లు పారబోసి నిరసన

ప్రజాశక్తి - భీమవరం : మద్యం ఆదాయం కోసం కల్లుగీత వృత్తిని నిర్వీర్యం చేసి గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తే సహించబోమని ఎపి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి హెచ్చరించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో గీత కార్మిక బతుకు పోరాట గర్జన కార్యక్రమం శుక్రవారం భీమవరంలో నిర్వహించారు. గీత వృత్తిని ప్రతిబింబించేలా మోకులు, కల్లుతో భీమవరం సిఐటియు కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్, జిల్లా కోర్టు మీదుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గీత వృత్తిని కాపాడాలని కార్మికులు ఆవేదనతో ఇఎస్ కార్యాలయం వద్ద కల్లు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. నరసింహమూర్తి మాట్లాడుతూ... టిడిపి కూటమి ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. గీత వృత్తిని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మద్యం అమ్మకాలు పెంచి కల్లు అమ్మకాలు లేకుండా దెబ్బతీసిందని, జిల్లాలో ఐదు వేల బెల్టు షాపులు విచ్చలవిడిగా సాగుతున్నాయని విమర్శించారు. కర్ణాటక తరహాలో టాడీ బాటిల్స్ ఏర్పాటు చేసి బీరు, బ్రాందీ, విస్కీలా హోటళ్లు, బార్లలో కల్లు అమ్మకాలు జరపాలని, ఎక్సైజ్ పాలసీని సవరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు కామన మునిస్వామి, గర్జనకు సంఘీభావంగా ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, పట్టణ పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్ ఎం వైకుంఠరావు పాల్గొన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్