గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition3 రోజుల్లో నిర్ణయం తీసుకోండి

4 గంటల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కలెక్టర్‌, ఇసి కార్యాలయాల్లో నామినేషన్లకు అవకాశం కల్పించడంపై ఇసికి హైకోర్టు ఆదేశాలు

ప్రజాశక్తి- అమరావతి : మున్సిపల్‌, జెడ్‌‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్థానికంగా నామినేషన్లు దాఖలు చేయలేని పరిస్థితులు ఎదురైతే, జిల్లా కలెక్టర్‌ లేదా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎన్నికల అధికారులకు వినతిపత్రం సమర్పించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వినతిపై మూడు రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. వైఎస్సార్‌‌సిపి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్‌ కార్యాలయం లేదా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సాఆర్‌‌సిపి ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్థానికంగా నామినేషన్లు దాఖలు చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేని అభ్యర్థులకు జిల్లా స్థాయిలో నామినేషన్లు వేసే వెసులుబాటు కల్పించాలని పిటిషన్‌లో కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. గురువారం ఉదయం నిర్ణయాన్ని వెలువరిస్తూ, స్థానికంగా నామినేషన్‌ దాఖలు చేయలేని అభ్యర్థులు కలెక్టర్‌ లేదా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పిస్తే, దానిపై మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే అభ్యర్థులు తమ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరేందుకు అవకాశం ఏర్పడింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్