శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రాక్టర్‌ తిరగబడి వ్యక్తి మృతి

4 గంటల క్రితం

tractor.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 10:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–పల్నాడు జిల్లా: రొంపిచర్ల మండలం గోగులపాడు గ్రామంలో శనివారం ట్రాక్టర్‌ తిరగబడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన భాస్కరరావు వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం ఉదయం ట్రాక్టర్‌పై పొలానికి బయలుదేరాడు. పొలంలోకి ట్రాక్టర్‌ను దించే సమయంలో అక్కడి ఎత్తుపల్లాల కారణంగా వాహనం అదుపుతప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో భాస్కరరావు ట్రాక్టర్‌ కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్