శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నో పోరాటాలు.. అనుభవాలు

1 గంట క్రితం

rythu sangham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 09:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మహాసభ ముందు కార్యదర్శి నివేదిక

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-బడా సుబ్బిరెడ్డి, వై జోయా నగర్‌ (ఏలూరు) : గత మహాసభ నుండి ఇప్పటి వరకు నాలుగేళ్లల్లో ఎపి రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ముందుకొచ్చిన పలు రైతాంగ సమస్యలపై పోరాటాలు నిర్వహించిందని, కొన్ని ఫలితాలు వచ్చాయని కార్యదర్శి నివేదికలో వివరించారు. స్వతంత్రంగా, ఇతర సంఘాలతో కలిసి ఐక్యంగా ఉద్యమాలు నిర్మించినట్లు తెలిపారు. ఏలూరులోని డిసిఎంఎస్‌ ‌హాలు (బడా సుబ్బిరెడ్డి, వై జోయా నగర్‌)‌లో జరుగుతున్న ఎపి రైతు సంఘం రాష్ట్ర మహాసభలో కార్యదర్శి కె ప్రభాకరరెడ్డి నివేదిక ప్రవేశపెట్టగా శనివారంనాడు ప్రతినిధులు ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు. ఈ కాలంలో చేసిన పోరాటాలు కేడర్‌‌లో ఎనలేని స్ఫూర్తిని నింపాయని, భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణకు దిక్సూచిగా నిలుస్తాయని చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు సింహవలోకనం చేసుకున్నారు. కార్యదర్శి నివేదికలోని ముఖ్యాంశాలు... బలవంతపు భూసేకరణ, కల్తీ విత్తనాలు, విశాఖ డెయిరీ యాజమాన్యం అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా, కరువు, తుపాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం కోసం, పొగాకు, మిర్చి, మొక్కజొన్న, కోకో, జీడి, ధాన్యం, జొన్నలు, శనగలు, మామిడి, బొప్పాయి, అరటి, చీనీ, ఉల్లి, టమాటా రైతుల పంట కొనుగోలు సమస్యపై రైతు సంఘం పలు పోరాటాలు చేసింది. పలు అనుభవాలు గడించింది. ప్రభుత్వ నిర్భందానికి వ్యతిరేకంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఉద్యమాలు జరిగాయి. సెజ్‌‌లు, పారిశ్రామిక కేరిడార్లు, గ్రీన్‌‌ఫీల్డ్‌ ‌హైవేలు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు, సోలార్‌ ‌పార్కుల పేరిట సరైన పరిహారం చెల్లించకుండా బలవంతంగా రైతుల భూములను లాగేసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లార్‌ ‌స్టీల్‌, బల్క్‌డ్రగ్‌ ‌పార్క్‌‌లకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిచింది. విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్‌‌పోర్టు, శ్రీకాకుళంలో కార్గ్‌ ఎయిర్‌‌పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగానూ పోరాటం నడిచింది. కాకినాడ జిల్లాలో దివీస్‌, సెజ్‌, ఏలూరులో గ్రీన్‌‌ఫీల్డ్‌ ‌హైవే, రాజధానిలో రెండవ దశ పూలింగ్‌‌, నెల్లూరులో కరేడు పోరాటాలు ముఖ్యమైనవి. అరెస్టులు, నిర్భందాలకు బెదరకుండా ఉద్యమించడం బాధితుల్లో ధైర్యాన్నిచ్చింది. పొగాకు రైతుల సమస్యలపై ఆందోళనలతో 2025లో ప్రభుత్వం కొంత మేరకు దిగొచ్చి రైతుల నుంచి పంట కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేకపోవడంతో రాస్తారోకోలు, పొగాకు బోర్డు ముట్టడి, భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. బుడమేరు వరదల సమయంలో కౌలు రైతు సంఘంతో కలిసి పరిహారం కోసం కృషి జరిగింది. కొబ్బరి, పండ్ల తోటలు, ఆక్వారంగ సమస్యలపై రైతులను కదిలించారు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ ‌మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటనతో అధికారులు వెనక్కి తగ్గారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్